పులి సంచారంతో వణుకుతున్న తూర్పుగోదావరి

Updated on: Feb 05, 2026 | 7:24 PM

తూర్పు గోదావరి జిల్లాలోని గాడాల, కోలమూరు పంట పొలాల్లో పులి సంచారం ప్రజలను, ముఖ్యంగా రైతు కూలీలను భయపెడుతోంది. అటవీశాఖ పెద్దపులి పాదముద్రలను గుర్తించి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని ఎమ్మెల్యే సూచించారు. సమీప పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులు పగటిపూట పులి బయటకు రాదని చెబుతున్నా, భయం మాత్రం వీడడం లేదు.

తూర్పుగోదావరి జిల్లా గాడాల , కోలమూరు సమీపంలోని పంటపొలాల్లో పులి సంచారం అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు, రైతు కూలీలు భయపడుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పంట పొలాల మధ్య పెద్దపులి పాదముద్రలను గుర్తించారు . గత మూడు రోజులుగా తొర్రేడు పంట పొలాల మధ్య ఉన్న పెద్దపులి… మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలమూరు సమీప పంట పొలాల వైపు వచ్చినట్టు గుర్తించిన అధికారులు ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు. అంతేకాదు, పెద్దపులి సంచారంతో సమీప స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. సాధారణంగా పెద్దపులి పగటిపూట బయటకు రాదని ప్రజలు భయపడవద్దని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోలమూరు చెరువు సమీపంలో ఒక కొబ్బరి చెట్టు కింద పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. రైతులు ఎవరు పంట పొలాల వైపు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు… మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు ..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి

పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Follow Us