Watch: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. సెకన్లలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. షాకింగ్ వీడియో
ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలలో తెల్లవారుజామున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. లాడ్జీ నిర్వాహకుడు అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం వెళ్లే మార్గంలో పరుచూరి సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన వాసవి లాడ్జీ భవనం కుప్ప కూలింది. భవనం పక్కనే యజమాని సోదరుడు రామారావు నూతన భవనాన్ని నిర్మించేందుకు 10 అడుగుల లోతు పునాదులు తీయించాడు.
ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలలో తెల్లవారుజామున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. లాడ్జీ నిర్వాహకుడు అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం వెళ్లే మార్గంలో పరుచూరి సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన వాసవి లాడ్జీ భవనం కుప్ప కూలింది. భవనం పక్కనే యజమాని సోదరుడు రామారావు నూతన భవనాన్ని నిర్మించేందుకు 10 అడుగుల లోతు పునాదులు తీయించాడు. పక్కనే ఉన్న లాడ్జీ భవనం పునాదులు అంతలోతుగా లేక పోవడం వలన ఆ భవనం పక్క స్థలంలో తీసిన పునాది గుంతలో కూలిపోయింది. భవనం కూలుతుందేమే అని ముందుగా అంచనా వేసిన సుబ్బారావు లాడ్జీ రూములు ఎవరికి అద్దెకు ఇవ్వలేదు. ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ క్రమంలో అనుమానించినట్లుగానే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముందు జాగ్రత్త చర్యలతోనే పెను ప్రమాదం తప్పిందని.. లేకపోతే.. భారీ నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..