AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!

బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!

Phani CH
|

Updated on: Jul 01, 2026 | 7:03 PM

Share

అంటార్కిటిక్‌లోని మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు ధూళిని గాల్లోకి విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏడాదికి దాని విలువ దాదాపు రూ.18.9 కోట్లుగా అంచనా. అగ్నిపర్వత వాయువులతో కలిసి సూక్ష్మ బంగారు కణాలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భయంకరమైన లావా వెదజల్లుతుంది. లేదంటే భయంకరమైన వేడి బూడిద, విష వాయువులు విరజిమ్ముతుందని ఇంతవరకూ మనకు తెలిసిన విషయం. కానీ, కొన్ని అగ్నిపర్వతాలు బంగారాన్ని కూడా విరజిమ్ముతాయని మీకు తెలుసా.. మీరు విన్నది నిజం.. అంటార్కిటిక్‌లోని ఒక అగ్నిపర్వతం ఏటా కోట్ల రూపాయల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి విరజిమ్ముతోంది. ఆ వింత అగ్నిపర్వతం పేరే ‘మౌంట్ ఎరెబస్’. అంటార్కిటిక్‌లోని రాస్ ద్వీపం సమీపంలో ఉన్న మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతంపై జరిగిన జియోఫిజికల్ పరిశోధనలలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ఈ అగ్నిపర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు ధూళిని వాతావరణంలోకి విడుదల చేస్తోంది. దీని వార్షిక విలువ అక్షరాలా రూ.18.9 కోట్లు ఉంటుందని అంచనా. ఈ అగ్నిపర్వత లావా నుండి వెలువడే అత్యంత వేడి వాయువులు.. స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలను తమతో పాటు మోసుకెళ్తున్నాయి. శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి 60 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ఈ బంగారు స్పటికాలను గుర్తించారు. ఈ కణాలు గాల్లో కలిసి అంటార్కిటిక్ మంచుపై స్థిరపడటానికి ముందు ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే అగ్నిపర్వత వాయువులలో బంగారం లభించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా వంటి అగ్నిపర్వతాల వద్ద కూడా స్వల్ప మొత్తంలో బంగారాన్ని గుర్తించినప్పటికీ.. ఎరెబస్ కురిపిస్తున్న పసిడి సిరులు మాత్రం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?

హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

Follow Us