Telangana: తెల్లారేసరికి బ్యాంక్ ఊడ్చేందుకు వచ్చిన సిబ్బంది.. డోర్ తెరవగా కనిపించింది చూసి

మెదక్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఓ బ్యాంకులో చోరీకి విఫల యత్నం చేశారు. తీరా లోపలికి వెళ్లాక అక్కడ అలారం మోగడంతో కంగారు పుట్టిన దొంగలు వచ్చినదారినే పారిపోయారు. ఆ వివరాలు.. ఇలా ఉన్నాయి.! ఈ ఆర్టికల్‌లో ఓసారి చూసేయండి మరి.

మెదక్‌ జిల్లాలోని వెల్దుర్తిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో దొంగలు చొరబడ్డారు. సోమవారం తెల్లవారుజామున బ్యాంకు వెనుకవైపున గోడకు పెద్ద రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. స్టోర్‌ రూమ్‌ వెనుకనుంచి తాళాలు పగలగొట్టిన దొంగలు లాకర్స్‌ రూమ్‌ దగ్గరకు వెళ్లగానే అలారం మోగింది. దాంతో భయపడిన దొంగలు వెంటనే అక్కడినుంచి పారిపోయారు. ఉదయం బ్యాంకు గోడకు రంద్రం ఉండటం చూసిన స్థానికులు చోరీ జరిగినట్టు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులో నగదు, బంగారం లాంటివి ఏమైనా అపహరించారా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి