Telangana: చీకటి గదిలో చిలక్కొట్టుడు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్

Updated on: Oct 05, 2025 | 11:17 AM

యాదగిరిగుట్టలో దొంగతనం చోటు చేసుకుంది. అమాయకుడ్ని బురిడీ కొట్టించి.. బైక్‌ను దొంగలించారు దొంగలు. దీనిపై కేసు నమోదు చేయగా.. పోలీసులు పరారీలో ఉన్న దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి.!

దొంగలు బాగా తెలివిమీరిపోయారు. యాదాద్రి బొమ్మలరామారం మండలంలో చోరీ జరిగింది. స్థానిక మర్యాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నైట్ డ్యూటీ చేస్తున్న ఆపరేటర్ పండరీనాధ్‌ను బురిడీ కొట్టించి.. అతడి బైక్ దొంగలించారు దుండగులు. అతడు పని చేస్తుండగా.. బయట నుంచి డోర్ లాక్ వేసి.. సైలెంట్‌గా దొంగలు తాము వచ్చిన పనిని కానిచ్చారు. ఇక ఈ ఘటనపై సదరు బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. వాళ్లు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

ఇది చదవండి: 

కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్