Khammam: ఓ ఇంటి ఆరుబయట నుంచి ఏదో వింత అలికిడి.. ఏంటా అని వెళ్లి చూడగా

Edited By: Ravi Kiran

Updated on: May 31, 2025 | 7:06 PM

ఇప్పటి వరకు బంగారం, డబ్బులు, లేదా కార్లు, బైక్‌లు ఎత్తుకెళ్లడం చూసి ఉంటాం. కానీ ఓ దొంగ వెరైటీగా బయట ఉంచిన దుస్తులు పట్టపగలే ఎత్తుకెళ్లాడు. తమ దుస్తులు చోరీకి గురికావడంతో సదరు కుటుంబం షాక్‌కు గురైంది. ఈ వింత దొంగతనం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఆరు బయట వేసిన దుస్తులను ఓ దొంగ దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం తాము ఉతికిన బట్టలను ఇంటి బయట ఆరవేసారు. పట్టపగలే ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ ఇంటి ఆవరణలో ఉన్న ఇతర వస్తువులను అన్నీ పరిశీలించాడు. కానీ అవేవి దొంగకు నచ్చలేదు. కేవలం దుస్తులను మాత్రమే ఓ సంచిలో పెట్టుకుని తీరిగ్గా ఎత్తుకెళ్లాడు. బయట ఉన్న వ్యక్తి ఎవరని దొంగను ప్రశ్నించగా.. తాను ఇయర్స్ ఫోన్స్ అమ్మేందుకు వచ్చానని చెప్పాడు. అయితే దొంగ డబ్బులు, విలువైన వస్తువులు తీసుకోకుండా కేవలం బట్టలే ఎత్తుకెళ్లడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దొంగతనం ఘటన అంతా ఎదురుగా ఉన్న ఓ షాపులోని సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి