ధనుర్మాసంలో చేసే పూజలతో ఎలాంటి ఫలితం ఉంటుంది?

Updated on: Dec 25, 2025 | 4:54 PM

ధనుర్మాసం జ్యోతిష్య, పౌరాణిక ప్రాముఖ్యతలు కలిగిన విశేష మాసం. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది. విష్ణుసహస్రనామం, తిరుప్పావై పారాయణం వంటివి చేయడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయి.

ధనుర్మాసం హిందూ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన, విశేషమైన మాసాలలో ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మాసం ప్రారంభమవుతుంది. ధనూరాశికి అధిపతి బృహస్పతి, జ్ఞానం, దైవానుగ్రహానికి ప్రతీక. సూర్యుడు గురువు అధిపత్యంలోని రాశిలో సంచరించడం వలన ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త సమయంగా పరిగణించబడుతుంది. ఈ మాసం ఉత్తరాయణం, దక్షిణాయణానికి సంధికాలం. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పడం ద్వారా ఈ మాసం ప్రాముఖ్యతను తెలియజేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో