Toppers Corner: ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు

Updated on: Apr 23, 2025 | 4:44 PM

UPSC Civil 68th Rank Holder Sai Chaitanya: తెలుగు విద్యార్థి సాయి చైతన్య ఐదుసార్లు విఫలమైనప్పటికీ, తన పట్టుదలను వదులుకోకుండా ఆరో ప్రయత్నంలో ఆలిండియా 68వ ర్యాంకుతో యుపిఎస్సి సివిల్స్ పరీక్షలో విజయం సాధించారు. నిరంతర కృషి, ఓటముల నుండి నేర్చుకునే సామర్థ్యం, ప్రణాళికాబద్ధమైన సన్నాహాలతో విజయాన్ని ముద్దాడారు. సాయి చైతన్య సివిల్స్ సక్సస్ స్టోరీ అనేకమందికి ప్రేరణగా నిలుస్తోంది.

UPSC Civil 68th Rank Holder Sai Chaitanya Face to Face: ఐదు సార్లు విఫలమైనా.. ఆరో ప్రయత్నంలో సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థి సాయి చైతన్య సత్తా చాటారు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతానికి చెందిన సాయి చైతన్య.. ఆలిండియా 68వ ర్యాంకుతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఓటములతో ఢీలాపడిపోకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తే విజయం తథ్యమని నిరూపించారు సాయి చైతన్య. ఓటముల నుంచే పాఠాలు నేర్చుకుంటూ.. తన లోపాలను సరిదిద్దుకుంటూ ఐదుసార్లు విఫలమైనా.. ఆరోసారి సివిల్స్ ర్యాంకుతో అందరి చూపును తన వైపునకు తిప్పికున్నాడు.

సాయి చైతన్య పట్టుదల, నిరంతర కృషి, ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ముందు ఓటమి కూడా తలవంచింది. ఓటములతో కుంగిపోయికుండా.. మరింత పట్టుదలతో సివిల్స్ ర్యాంకు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలచాడు.2019 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సాయి చైతన్య తెలిపారు. ఐదుసార్లు విఫలమైనా.. ఇప్పుడు సివిల్స్ 68 ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ర్యాంకు రాలేదని దిగులు చెందకుండా ప్రయత్నిస్తూ ఉంటే తప్పనిసరిగా విజయం వస్తుందని చెప్పారు. ర్యాంకులు రాని వారికి తానిచ్చే సలహా ఇదే అన్నారు.

మరి సాయి చైతన్య సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు దోహదపడిన అంశాలు ఏంటి? దీని కోసం ఎలాంటి ప్రణాళికలతో ప్రిపేర్ అయ్యారో? ఇక్కడ వీడియోలో చూద్దాం..

Published on: Apr 23, 2025 04:36 PM