హైదరాబాద్‌లో కూల్ కూల్.. తెలంగాణలో వర్షాలు..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం 7 గంటల నుంచే చల్లని గాలులు వీస్తుండటంతో వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఆరు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం 7 గంటల నుంచే చల్లని గాలులు వీస్తుండటంతో వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఆరు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందనీ తెలంగాణపై ద్రోణి ప్రభావం బలంగా ఉందని అన్నారు. రాగల ఆరు రోజులు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో వడగళ్లవాన పడే అవకాశం కూడా ఉందని సూచించింది ఐఎండీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధోని ఎంట్రీతో దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్ వాచ్ వార్నింగ్ అలర్ట్
భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??