Telangana: క్రికెటర్‌ సిరాజ్‌కు ప్రభుత్వం నజరానా.. జూబ్లీహిల్స్‌లో స్థలం కేటాయింపు..

|

Aug 10, 2024 | 9:40 AM

టీ20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా మెంబర్‌, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.

టీ20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా మెంబర్‌, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్‌ సాధించిన తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న సిరాజ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని కూడా బహూకరించారు. ఈ సందర్భంగా.. సిరాజ్‌ను అభినందించిన సీఎం.. హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థలాన్ని వెంటనే గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేయడంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లోని ఇంటి స్థలానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రెవెన్యూశాఖ.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on