Telangana Rains: వాన తగ్గినా వరద తగ్గలే.. ఇంకా జలదిగ్బంధంలోనే చాలా గ్రామాలు

Updated on: Aug 29, 2025 | 5:50 PM

వానతగ్గినా వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నాయని..ఎక్కడికక్కడ రెస్క్యూ బృందాలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.. నిర్మల్ జిల్లా జాతీయ రహదారి 161పై రాకపోకలు నిలిచిపోయాయి. బైంసా - బాసర మధ్య బిద్రేల్లి‌ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు నిలిపివేశారు.

వానతగ్గినా వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నాయని..ఎక్కడికక్కడ రెస్క్యూ బృందాలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.. నిర్మల్ జిల్లా జాతీయ రహదారి 161పై రాకపోకలు నిలిచిపోయాయి. బైంసా – బాసర మధ్య బిద్రేల్లి‌ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు నిలిపివేశారు. బిద్రేల్లి‌ దగ్గర బారికేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎన్‌హెచ్-161పై ఇరు వైపులా కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బైంసా పట్టణంలోని రాహుల్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బైంసా, బాసర, తానూర్‌ మండలాల్లోని 20 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పోచమ్మ రాళ్ల దగ్గర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రాకపోకలు చిలిచిపోవడంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పలు గ్రామాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించారు. రామాయంపేట్‌ – సిద్దిపేట జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి.

జాతీయ రహదారి 44పై భారీ వాహనాల రాకపోకలు నిషేదించడంతో అధికారులు ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా వాహనాలు హైదరబాద్ వెళ్తున్నాయి. దీంతో ఖానాపూర్ నుంచి మెటపల్లి వరకు భారీగా ట్రాపిక్ జామ్‌ అయింది. భారీ ట్రాఫిక్‌ జామ్‌తో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Published on: Aug 29, 2025 05:50 PM