Telangana: తెలంగాణలో సోమవారం నుంచి కాలేజీలు బంద్‌

Updated on: Sep 14, 2025 | 5:54 PM

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యే సరికి, సోమవారం నుంచి తెలంగాణలోని ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కాలేజీలు బంద్‌కు వెళ్లనున్నాయి. మంటళవారం నుంచి డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా మూతపడతాయి. రూ.8 వేల కోట్ల బకాయిలలో కనీసం రూ.1,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

తెలంగాణలో సోమవారం నుంచి కాలేజీలు బంద్‌ కానున్నాయి. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన ఫలించకపోవడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15, సోమవారం నుంచి ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కాలేజీలు మూతపడనున్నాయి. ఇక ఎల్లుండి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ కానున్నాయి. తమకు 8 వేల కోట్ల రూపాయిల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. వెంటనే వెంటనే రూ.1,200కోట్లు విడుదల చేయాలని కళాశాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చించేందుకు ప్రభుత్వం ఆదివానం సాయంత్రం కాలేజీ యాజమాన్యాలను సమావేశానికి పిలిచింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న కళాశాలల బంద్‌ పిలుపు నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.