Telangana: వేడెక్కిన రాజకీయం.. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన.. టెన్షన్.. టెన్షన్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అవుతాయి. అసెంబ్లీలో ఈరోజు సీఎం రేవంత్ కీలక ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటించనున్నారు సీఎం.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అవుతాయి. అసెంబ్లీలో ఈరోజు సీఎం రేవంత్ కీలక ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటించనున్నారు సీఎం. విగ్రహంలో మార్పులపై ఆయన వివరించనున్నారు. ఇక ఈ సెషన్‌లో ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది సర్కార్. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోయే బిల్లును కూడా పెట్టనుంది రేవంత్ ప్రభుత్వం.
మరోవైపు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ తల్లి విగ్రహంపై పోరాటం చేయనుంది. విగ్రహంలో మార్పులు, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసింది. రైతుబంధుపై పోరాడతామంటున్న బీఆర్‌ఎస్.. ఫార్మాసిటీ ఎందుకు మార్చాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అటు ప్రభుత్వ వైఫ్యలాలు ఎండగడతామంటోంది బీజేపీ. రైతుల సమస్యలు, నిరుద్యోగం, శాంతిభద్రతలు.. మూసీ, హైడ్రా, జీవో 317పై పోరాటం చేస్తామంటోంది బీజేపీ. 20 రోజులకు తగ్గకుండా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ సూచిస్తోంది. ట్రాక్టర్‌పై అసెంబ్లీకి రానున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..