అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..

Updated on: Dec 13, 2025 | 1:51 PM

తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ 2026 విడుదలైంది. చరిత్రలో తొలిసారి నెలరోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14న మొదలై ఏప్రిల్ 16న ముగుస్తాయి. అయితే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌పై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అనవసర ఒత్తిడి, ప్రశ్నాపత్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే షెడ్యూల్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. చరిత్రలోనే తొలిసారి టెన్త్‌ ఎగ్జామ్స్‌ను నెలరోజులపాటు నిర్వహించనున్నారు. షెడ్యూలు ప్రకారం, 2026 మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16న ముగియనున్నాయి. ఈసారి ఏడు పేపర్లకు జరిగే పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనుండటం గమనార్హం. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్కో పరీక్షకు కనీసం మూడు రోజులు గ్యాప్ రావడం మధ్యలో పండగ హాలిడేస్ ఉండటంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరగనున్నాయి. అయితే పరీక్షలు నెలరోజుల పాటు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని విద్యార్థి సంఘాలు షెడ్యుల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని మండిపడుతున్నాయి. AISF లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు షెడ్యుల్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదని.. ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని కోరుతున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉంటే సరిపోతుందని కానీ ఏడు పరీక్షలకు నెల రోజుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని అంటున్నారు. అంతేకాకుండా నెల రోజులపాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నాపత్రాల భద్రత, మూల్యాంకన ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ని సవరించి మరొక షెడ్యూల్ విడుదల చేయాలని AISF విద్యార్థి సంఘాల నేతలు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ షెడ్యూల్‌పై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫెస్టివల్ హాలిడేస్‌లో విద్యార్థులు ఇబ్బంది పదొద్దని ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కువ గ్యాప్ వల్ల స్టూడెంట్స్‌పై నెగటివ్ ప్రభావం ఉంటుందని మరికొందరు విద్యావేత్తలు అంటున్నారు. టీచర్లు సైతం తొలిసారి ఇంత లాంగ్ గ్యాప్‌‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

మా విశ్రాంతి మాటేంటి ?? ప్రశ్నిస్తున్న లోకోపైలట్లు

జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ