పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే

Updated on: Feb 04, 2025 | 8:56 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1, ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్‌ లాంగ్వేజ్ పరీక్ష, ఫిబ్రవరి 12న ఇంగ్లిషు పరీక్ష, ఫిబ్రవరి 13న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2, మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 సంస్కృతం, అరబిక్, పర్షియన్‌ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 15న గణితం, ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం పరీక్ష, ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం పరీక్ష, ఫిబ్రవరి 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 , ఫిబ్రవరి 20న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి. ఇక టెన్త్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి నెలలో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి అధ్యక్షా ఇది.. పెళ్లిళ్లున్నాయ్.. బంగారం కొననివ్వరా ??

మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం

Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?

ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..

స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు