AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం

కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం

Phani CH
|

Updated on: May 19, 2026 | 4:55 PM

Share

మూడు వారాల కోమా నుంచి బయటపడ్డ ఫ్రాన్స్ యువతి క్లెలియా వెర్డియర్, తాను ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి ఏడేళ్లు పెంచిన తల్లినని చెప్పడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఆమెకు పెళ్లి కూడా కాలేదు. కోమాలో ఉన్న సమయంలో మెదడు సృష్టించిన భావోద్వేగ భ్రాంతులు ఎంత వాస్తవంగా అనిపిస్తాయో ఈ ఘటన మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

మూడు వారాల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత మేల్కొన్న 19 ఏళ్ల క్లెలియా వెర్డియర్ అనుభవం ప్రస్తుతం వైద్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఆ యువతి, స్పృహలోకి రాగానే తన నొప్పి గురించి కానీ తన పేరు ఏంటని కానీ అడగలేదు. తన ముగ్గురు కూతుళ్ల గురించి ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు పెళ్లి కానీ, పిల్లలు కానీ లేని ఆ యువతి, కోమాలో ఉన్న సమయంలో ముగ్గురి బిడ్డలకు జన్మనిచ్చి వారిని ఏడేళ్ల పాటు పెంచి పెద్ద చేసిన తల్లిగా జీవించినట్లు మెదడు సృష్టించిన భ్రాంతి ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోమా అనేది ఒక వ్యక్తి చాలా కాలం పాటు అపస్మారక స్థితిలో ఉండే ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. ఈ సమయంలో ఆ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు స్పందించడు. ఆ వ్యక్తి మేల్కొనలేడు. సాధారణంగా మాట్లాడలేడు. కదలలేడు. అయితే ప్రతి రోగికి కోమా నుంచి బయటకు రావడానికి పట్టే సమయం భిన్నంగా ఉంటుంది.. తన ముగ్గురు పిల్లల్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చి తనకు ఎందుకు చూపించడం లేదని క్లేలియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమె అసలు గర్భం దాల్చలేదని డాక్టర్లు ఆమెకు వివరించే ప్రయత్నం చేసారు. ఆమె ముగ్గురికి జన్మనిచ్చి వారిని ఏడేళ్ల పాటు పెంచి పెద్ద చేసినట్లు ఆమె మెదడు భ్రాంతిని సృష్టించింది. కలలో తను ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాననీ ఆ సమయంలో పురిటి నొప్పులు పడ్డాననీ నవజాత శిశువులను తన ఛాతీపై పడుకోబెట్టగా వారి స్కిన్ కాంటాక్ట్‌ తనకు మధురానుభూతిని మిగిల్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమెకు తన గతం కంటే కూడా కోమాలో కన్న కలలే వాస్తవంగా అనిపించాయి. తనకు మిలా, మైల్స్, మైలీ అనే ముగ్గురు కూతుళ్లు జన్మించారనీ , వారితో కలిసి మైలీ మృతి చెందిందనీ తెలిపింది. ఇద్దరు పిల్లలను ఏడేళ్లు సాకాననీ వారితో పార్కులకు వెళ్లడం, భోజనం చేయడం వంటి జ్ఞాపకాలు తన మెదడులో బలంగా ముద్రపడిపోయాయనీ చెప్పింది. అసలు తనకు పిల్లలే లేరని వైద్యులు చెప్పడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కలలో తను మాతృత్వపు మమకారాన్ని అనుభవించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అదే నిజమైతే ఎంతో బాగుండునని కోరుకుంది కూడా. తీవ్రమైన మెదడు గాయం, పక్షవాతం, ఆక్సిజన్ లోపం, ఇన్ఫెక్షన్, మద్యం, మాదకద్రవ్యాల అధిక మోతాదు, తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల సాధారణంగా కోమా రావచ్చు. మెదడుకు తగినంత ఆక్సిజన్ లేదా రక్తం అందనప్పుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. కోమాలో ఉన్నప్పుడు రోగికి తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇతర శరీర విధులను నిర్వర్తించడానికి వైద్య సహాయం అవసరం. కొన్నిసార్లు రోగి తమ చుట్టూ ఉన్న శబ్దాలను వినగలుగుతారు కానీ మాట్లాడలేరు. ఆపరిస్థితి కొన్ని రోజులు లేదా కొన్నిసార్లు యేళ్ల పాటు కొనసాగవచ్చు. అందువల్ల కోమాను ఒక తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు. 2025 జూన్‌లో ఆత్మహత్యాయత్నం చేసి కోమాలోకి వెళ్లిన క్లెలియా, మూడు వారాల తర్వాత మేల్కొంది. న్యూరాలజిస్టుల ప్రకారం, మెదడు తీవ్రమైన ఒత్తిడికి లేదా గాయాలకు గురైనప్పుడు అలాంటి వాస్తవికమైన కలలు రావడం జరుగుతుంది. సాధారణంగా కోమాలో ఉన్నప్పుడు నిద్రపోవడం జరగదనీ మెదడు పూర్తిగా నిష్క్రియం కాకుండా, కొన్నిసార్లు ఇలాంటి సంక్లిష్టమైన భావోద్వేగభరితమైన ఊహల ప్రపంచాన్ని సృష్టిస్తుందనీ కోమా నుంచి బయటపడిన కొందరు తమ గతాన్ని పూర్తిగా మరచిపోతారని అంటున్నారు. . ఏడాది గడిచినా, ఆ పిల్లలపై తనకున్న ప్రేమ తగ్గలేదని, తాను ఎప్పటికీ వారి తల్లినేనని క్లెలియా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

500 బ్రెడ్‌లతో భారీ డ్రెస్.. బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం

అరుదైన దృశ్యం.. ఒకే చోట మూడు పాముల ‘సయ్యాట’

Follow Us