Xiaomi EV Car: ఒకసారి ఛార్జ్‌ చేస్తే హైదరాబాద్‌ టు శ్రీకాకుళం.! షావోమీ కారు వచ్చేసిందోచ్‌.!

|

Mar 14, 2024 | 5:31 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్‌’ దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ’,

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్‌’ దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్‌-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్‌ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం గంటకు 210 కి.మీ. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..