ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

Updated on: Oct 08, 2025 | 6:51 PM

ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సప్‌ మరో అద్భుతమైన సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇదివరకే వాయిస్‌ మెసేజ్‌లను టెక్ట్స్‌ రూపంలో అందించే సదుపాయం తెచ్చిన వాట్సప్‌.. తాజాగా మెసేజ్‌లను నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌ భాషాపరమైన ఇబ్బందులను తొలగించనుందని వాట్సప్‌ పేర్కొంది. వాట్సప్‌కు ఇటీవల ఏఐని జోడించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్‌లో మరిన్ని భాషలకు ఈ అనువాద సదుపాయం విస్తరించనుంది. ఈ ఫీచర్‌ వ్యక్తిగత చాట్స్‌తోపాటు, గ్రూప్‌ సందేశాలు, ఛానల్‌లో వచ్చే సందేశాలకూ పనిచేస్తుందని వాట్సప్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను రోల్‌ ఔట్‌ చేస్తున్నట్లు తెలిపింది. అంటే త్వరలో యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌లో ఇంగ్లిష్‌, స్పానిష్‌, హిందీ, పోర్చుగీస్‌, రష్యన్‌, అరబిక్‌ భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఐఓఎస్‌లో మొత్తం 19 భాషలను ఇది అనువదించగలదు. వాట్సప్‌లో వచ్చే సందేశాన్ని మీరు అనువాదం చేయాలనుకుంటే ఆ సందేశంపై లాంగ్‌ ప్రెస్‌ చేయాల్సిఉంటుంది. అక్కడ మీకు ట్రాన్స్‌లేట్‌ అనే ఫీచర్‌ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏ భాషలోకి అనువదించాలని అనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్‌ కావాలంటే ఆటోమేటిక్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడే వచ్చే ప్రతి సందేశం కూడా ఆటోమేటిక్‌గా అనువాదం అవుతుంది. ఈ అనువాద ప్రక్రియ డివైజ్‌లోనే జరుగుతుందని, వాట్సప్‌ ఈ సందేశాలను చదవబోదని పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు అలిగాడని అప్పు చేసి బైక్‌ కొనిస్తే.. రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మృతి

ఆ కారుకు తరచుగా రిపేర్లు.. యజమానికి రూ.కోటి ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

Paralysis: పక్షవాతం లక్షణాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అనుకోని వరంలా మారిన ఉత్తర బెంగాల్ వరదలు