టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే
ఇకపై మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్‌వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్దమవుతోంది.
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ నెల రెండవ వారంలో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో శాస్త్రవేత్తలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహంను ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ద్వారా ఈ సీఎంఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. ఎల్‌వీఎం-3ఎం మార్క్-5ను వచ్చేనెల రెండో వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. షార్ లో రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువైన బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఈ నెలాఖరులోగా ఉప గ్రహం భారత్‌కు చేరుకోనుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్ కు ప్రత్యక్ష అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధార పడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి.. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు.. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సీఎంఎస్ ఉపగ్రహం దోహదపడుతుంది. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించారు. అయితే ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ రాకెట్ ప్రయోగం గనుక విజయవంతం అయితే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా ?? సింపుల్ టిప్స్.. ఇలా చేయండి
వామ్మో! టన్ను బరువున్న గుమ్మడికాయ ఎలా పండించారంటే
‘ఆట్రోవర్ట్’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!
