చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?
ప్రపంచం 2024 YR4 గ్రహశకలంపై దృష్టి సారించింది. ఇది చంద్రుడిని ఢీకొట్టే 4% అవకాశం ఉంది. భారీ విస్ఫోటనం (హిరోషిమా కంటే 400 రెట్లు), భూమిపై ఉల్కలు, ఉపగ్రహ వ్యవస్థల అంతరాయం వంటి తీవ్ర పరిణామాలు ఉండవచ్చు. నాసా, ఇస్రో వంటి సంస్థలు నివారణ చర్యలపై చర్చిస్తున్నాయి. ఈ సంఘటన చంద్రుడి పుట్టుక రహస్యాలను వెల్లడించే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల దృష్టి ‘2024 YR4’ అనే గ్రహశకలంపై నెలకొంది. ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిపై చైనాలోని సింగువా యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే కీలక వివరాలను వెల్లడించారు. ఒకవేళ ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే జరిగే విస్ఫోటనం ఊహించని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా హిరోషిమా అణుబాంబు కంటే 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేశారు. అంతేకాదు, చంద్రుడిపై కిలోమీటరు వ్యాసార్థంతో భారీ గొయ్యి ఏర్పడుతుందని, చంద్రుడి ఉపరితలం రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో కంపిస్తుందని వెల్లడించారు. ఈ విస్ఫోటనం ప్రభావం కేవలం చంద్రుడికే పరిమితం కాకుండా భూమిపై కూడా పడే అవకాశం ఉందన్నారు. చంద్రుడి నుంచి ఎగసిపడే దుమ్ము, ధూళి భూ వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కాపాతంగా మారవచ్చంటున్నారు. ఈ విస్పోటనం కారణంగం A కొన్ని భారీ ఉల్కలు భూమిపై పడి భవనాలను ఢీకొట్టే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలోని శాటిలైట్లు ధ్వంసమై ఇంటర్నెట్, నావిగేషన్ వ్యవస్థలు స్తంభించిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ ముప్పును తప్పించేందుకు గ్రహశకలం గమనాన్ని మార్చాలా? లేదా కొత్త మిషన్లు చేపట్టాలా? అనే కోణంలో నాసా (NASA), ఇస్రో (ISRO) వంటి సంస్థలు చర్చిస్తున్నాయి. అయితే, ఈ సంఘటన జరిగితే చంద్రుడి పుట్టుకకు సంబంధించిన రహస్యాలను ఛేదించే అవకాశం కూడా లభిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిరి లక్ష్మీనరసింహస్వామి రథానికి తాళ్లరేవు కొబ్బరితాడు
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్