హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు

Updated on: Jun 25, 2025 | 6:03 PM

డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీకైనట్లు తేలింది. చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఇది ఒకటని సైబర్‌ భద్రతా పరిశోధకులు తెలిపారు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. ఆపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, గిట్‌హబ్‌, టెలిగ్రామ్‌ సహా వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్ల యూజర్ల లాగిన్‌ వివరాలు హ్యాకర్ల చేతికి చేరాయి.

అంతేకాదు వివిధ రకాల సామాజిక మాధ్యమాల యూజర్లకు సంబంధించిన వివరాలు కూడా లీకైనట్లు తేలింది. గతంలో 184 మిలియన్ల యూజర్ల లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు లీకైనట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ఇప్పుడు 16 బిలియన్‌ల లాగిన్‌ వివరాలు లీకైనట్లు తెలిసింది. అంతేకాదు, సైబర్‌ భద్రతా పరిశోధకులు మొత్తం 30 డేటాసెట్‌లను కూడా కనుగొన్నారు. ఒక్కో డేటాసెట్‌లో 3.5 బిలియన్‌ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సోషల్ మీడియా, VPN, డెవలపర్ పోర్టల్స్, అనేక ప్రధాన కంపెనీల ఖాతాల లాగిన్ ఆధారాలు ఉన్నాయి. ఆ సంస్థలకు చెందిన ఖాతాల్లో 2025 ప్రారంభం నుంచి లాగిన్‌ ఖాతాల వివరాలు డేటాసెట్‌లో రికార్డ్‌ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ డేటా లీక్‌ వెనుక అనేక గ్రూపుల ప్రమేయం ఉందని సైబర్ భద్రతా పరిశోధకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరో ఆ లక్కీ మ్యాన్‌.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు

పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం