ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ..ఆశ్చర్యంగా పని చేస్తోంది

Updated on: Sep 02, 2025 | 3:14 PM

ఒంటికి చీపుర్లు కిడ్నీలే! అవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను వేరుచేసి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. అందుకే ఎవరైనా సరే కిడ్నీల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. మూత్రపిండాలు అనగానే మూత్రం తయారుచేయటమే గుర్తుకొస్తుంది.

ఇదొక్కటే కాదు.. రక్తపోటును నియంత్రించటం దగ్గర్నుంచి హార్మోన్ల సమతుల్యతను కాపాడటం, ఎముకల పటుత్వానికి దోహదం చేయటం, ఎర్ర రక్తకణాల తయారీ, విటమిన్‌ డిని ఉత్తేజితం చేయటం, రక్తంలో ఆమ్ల తత్వం పెరగకుండా చూడటం వంటి రకరకాల పనులు చేస్తాయి. మూత్రపిండం మార్పిడి చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అవయవ దాతల కోసం నిరీక్షిస్తున్నవారు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. అవసరానికి అవయవం దొరక్కపోవడం వల్ల 40శాతానికి పైగా రోగులు అర్ధాంతరంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. జంతు జాతుల నుంచి కణజాలాలు, అవయవాలను సేకరించి, మార్పిడి చికిత్సలు జరపడం ఈ సమస్యకు పరిష్కారమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కృత్రిమ అవయవాల వైద్యం ఇప్పుడు కొత్త రికార్డు సాధించింది. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన మూత్రపిండం నమూనా వైద్య చరిత్రలోనే అత్యధిక రోజులు యాక్టివ్‌గా ఉండి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ కిడ్నీని ఇజ్రాయెల్‌ డాక్టర్లు ఓ ల్యాబ్‌లో తయారు చేశారు. ఎన్నడూ లేనంతగా ఆ కిడ్నీ రికార్డు స్థాయిలో 34 వారాలకు పైగా పనిచేసింది. దీర్ఘకాలం ఉన్న కిడ్నీని ల్యాబ్‌లో సృష్టించడం విజయవంతమైంది. ఇక క్లినికల్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఎంబో జర్నల్‌ ప్రచురించింది. ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్‌ సెంటర్‌ బృందం, టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీతో కలిసి ఈ 3డీ సింథటిక్‌ కిడ్నీని అభివృద్ధి చేసింది. గతంలో ఇలాంటి కృత్రిమ కిడ్నీలు నాలుగు వారాలు మాత్రమే ఉంటే.. ఇది అంత కంటే చాలా ఎక్కువ కాలం పనిచేసింది. అయితే ఇది ఇంకా అవయవ మార్పిడికి సిద్ధం కాలేదు. కృత్రిమ అవయవాల్లోని జీవ అణువుల ద్వారా మూత్రపిండాలను మరమ్మతు చేసే అవకాశం ఉందని డాక్టర్‌ బెంజమిన్‌ డెకెల్‌ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలో ఆధార్ యాప్ ఇక.. ఆధార్ సెంటర్లకు బై బై

టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో

Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు

గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !

అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే