బాబోయ్.. ఛార్జర్ ను ఇలా కాని వాడుతున్నారా !!

|

Nov 27, 2024 | 6:34 PM

చాలా ఇళ్లలో ఇది కామన్ గా చూసే దృశ్యం. ఫోన్ చార్జింగ్ కేబుల్ కు ప్లాస్టర్లు చుట్టి.. రకరకాలుగా రిపేర్లు చేసి వాడుతూ ఉంటారు. చార్జర్ విషయానికొచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్ గా మారిపోతుంటారు. కానీ ఇది తప్పు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వాడకం వల్ల కొన్ని ప్రమాదాల జరుగుతుంటాయి. కానీ ఇలా తాత్కాలికంగా రిపేర్లు చేసి వాడుతున్న ఛార్జర్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.

దానికి తోడు నాసిరకం, చైనా చార్జర్లతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చేసింది. గత ఐదేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై వివిధ దేశాల్లో స్టడీ చేశారు. ఇందులో ఈ షాకింగ్ మ్యాటర్ తెలిసింది. లక్షలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు కానీ ఒకటి రెండు వేలలో వచ్చే మంచి చార్జర్ కొనే విషయంలో చాలామంది వెనకడుగు వేస్తారు. మరోవైపు మొబైల్ కంపెనీలు కూడా ఫోన్ తో పాటు చార్జర్ ను ఇవ్వడం నిలిపివేశాయి. దీంతో ఇళ్లలో ఉండే పాడైన పాత చార్జర్ కే ప్లాస్టర్లు వేసి, రబ్బర్లు చుట్టి, వాటినే మళ్లీ మళ్లీ రిపేరు చేస్తూ వాడుతున్నారు. ఇలాంటి చార్జర్లు వాడడం ద్వారా కరెంటు షాక్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ. వచ్చేది చిన్నపాటి షాక్ అయినా పెద్దవాళ్లు తట్టుకోగలరు అదే చిన్నపిల్లలైతే అది వాళ్లకి ప్రాణాంతకం. ప్లాస్టర్లు చుట్టిన చార్జింగ్ కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ అయి పెద్దపెద్ద అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగలను పట్టుకోవాలంటే.. ఆ గుడికి వెళ్తే చాలు