కాలర్ ఐడీ వచ్చేస్తోంది ఇక ఫేక్ కాల్స్‌కు చెక్

Updated on: Nov 01, 2025 | 11:27 AM

గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ ఎవరివో తెలియడానికి చాలా మంది ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ వాడుతుంటారు. మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. ట్రూ కాలర్ తరహాలో అతి త్వరలో స్వదేశీ కాలర్ ఐడీ వెర్షన్ రాబోతుంది. ఫేక్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ఇకపై ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధార పడాల్సిన పనిలేదు. టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రతిపాదనకు ట్రాయ్‌ ఆమోదం తెలిపింది.

ఈ కొత్త సిస్టమ్ ద్వారా రిసీవర్ ఫోన్ స్క్రీన్‌పై కాలర్ రియల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో ఏది ఫేక్ కాల్ ఏది రియల్ అనే తేడా ఈజీగా తెలుసుకునేలా ట్రాయ్ ఈ కొత్త సిస్టమ్ ప్రవేశపెడుతోంది. టెలికాం ఆపరేటర్‌తో రిజిస్టర్ అయిన యూజర్ పేరు మాత్రమే కనిపిస్తుంది. టెలికాం కంపెనీల అధికారిక సబ్‌స్క్రైబర్ డేటాబేస్ నుంచి డేటా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికి ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ తెలిపింది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ CNAP అనే పేరున్న ఈ విధానం ప్రైవసీతో పాటు కంట్రోలింగ్ కూడా అందిస్తుంది. స్పామ్ కాల్స్‌, మోసాల బారి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాల్‌కు ఆన్సర్ చేయడానికి ముందే కాలర్ పేరు కనిపిస్తుంది. స్పామ్ కాల్‌ స్కామ్ కాల్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ అది స్పామ్ కాల్ అని తెలిస్తే ఆన్సర్ చేయకుండా ఉండొచ్చు. టెలికమ్యూనికేషన్స్ విభాగం ఎంపిక చేసిన నగరాల్లో CNAP ఫీచర్ ట్రయల్‌ను నిర్వహించింది. 2026 మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా సీఎన్‌ఏపీ సర్వీసును వినియోగదారులకు అందించనున్నారు. వోడాఫోన్‌ ఐడియా, జియో సంస్థలు హరియానాలో ఇప్పటికే సీఎన్‌ఏపీ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా

ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్‌ దొంగ కూడా

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌