మన ఉపగ్రహాలకు బాడీగార్డ్ లు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తమ ఉపగ్రహాల రక్షణ కోసం "ఆపరేషన్ శాటిలైట్ బాడీగార్డ్"ను ప్రారంభించనుంది. 27,000 కోట్ల రూపాయలతో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్షంలోని ముప్పులను ముందే గుర్తించి భారత ఉపగ్రహాలను కాపాడటం లక్ష్యం. వచ్చే ఏడాది ఈ ప్రయోగం జరగనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయ ఉపగ్రహాలను రక్షించేందుకు “ఆపరేషన్ శాటిలైట్ బాడీగార్డ్”ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 27,000 కోట్ల రూపాయలతో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలు ఇతర దేశాల ఉపగ్రహాల నుండి వచ్చే సంభావ్య ముప్పులను ముందే గుర్తించి భారత ఉపగ్రహాలకు రక్షణ కల్పిస్తాయి. స్టార్ లింక్ ఉపగ్రహాల వంటి అంతరిక్ష వస్తువులతో సంభవించే ఢీకొట్టుకునే ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యం. భూమిపై ఉన్న కమాండ్ సెంటర్ల నుండి ఈ బాడీగార్డ్ ఉపగ్రహాలను నియంత్రిస్తారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
Published on: Sep 23, 2025 11:19 AM
