పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

Updated on: Apr 22, 2025 | 5:52 PM

దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు. లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ, ఇంపీరియల్‌ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్‌లో మానవ దంతాన్ని పెంచారు. ప్రస్తుతం దంత సమస్యలతో డాక్టర్‌ వద్దకు వెళితే.. ఇంప్లాంట్‌ లేదా ఫిల్లింగ్‌ చేయాలనో సూచిస్తాడు.

ఇది సహజ దంతాల రూపం, పనితీరును పునరుద్ధరించటంలో విఫలమవుతున్నది. అయితే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి.. దంతాలు కోల్పోయిన వారికి కొత్త మార్గాన్ని చూపిందని అధ్యయనం పేర్కొన్నది. ఇన్నాళ్లు దంతాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా దంతాలను కోల్పోయినా.. దంతాలను ఇంప్లాంటు చేయించుకునేవారు. అయితే ఇవి ఒరిజనల్‌ దంతాల మాదిరి సౌలభ్యాన్ని అందించలేకపోయేవి. ఇప్పుడు ఈ ఆవిష్కరణతో ఆ సమస్యకు చెక్‌పెట్టినట్లయింది. దంతాల సమస్యతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను అందించింది. ఈ బయోమెటీరియల్స్ కణాలు సహజ దంతాల మాదిరిగానే ఉంటాయి. పునరుత్పత్తి ద్వార ఇది మొత్తం దంతాన్ని అభివృద్ధిచేస్తుందట. దంతాల నష్టంతో బాధపడే లక్షలాదిమందికి ఆ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందట. జీవసంబంధమైన రీతీలోనే దంతం భర్తీ చేయాలన్న లక్ష్యం నెరవేరింది. తాము అభివృద్ధి చేసిన ఈ దంతాలు దవడలో కలిసిపోతాయి, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా బలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?