శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
విమానం ల్యాండ్ అవ్వాలన్నా, టేకాఫ్ అవ్వాలన్నా రన్‌వే తప్పనిసరి. మరి మీరేంటి రన్‌వే అవసరం లేని విమానం అంటున్నారు.. అదెలా సాధ్యం? అనుకుంటున్నారా? సాధ్యమే అంటున్నారు మన శాస్త్రవేత్తలు. మద్రాస్ ఐఐటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం విమానం నేరుగా, నెమ్మదిగా దిగడానికి వీలైన ఓ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది.
ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఈ సాంకేతిక ఆవిష్కరణలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో భారత్ కూడా చేరింది. ఐఐటీ మద్రాస్ బృందం హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్, వర్చువల్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగించి, విమానం నేరుగా నిలువుగా దిగడానికి వీలయ్యేలా చేసింది. దీనికి క్లిష్టమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇక్కడ విమానం లేదా వైమానిక వాహనం దిగేటప్పుడు ఎంత నెమ్మదిగా.. ఎంత సాఫ్ట్‌గా దిగుతుంది అనేది ముఖ్యం. దీనిని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. ప్రస్తుతం నేరుగా ఎగరడం, దిగడం చేయగల ఫ్లయింగ్ టాక్సీలను ఆవిష్కరించారు. అయితే, వాటి టెక్నాలజీ చాలా క్లిష్టంగా ఉంటుంది. వాటి మెయింటెనెన్స్ కూడా కష్టమైనదే. ఈ నేపథ్యంలోనే ఐఐటీ మద్రాస్ బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించి విజయం సాధించింది. ఈ బృందం తమ ప్రయోగ వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించింది. తాము ఆవిష్కరించిన ఈ సిస్టమ్ ను టెక్నికల్‌గా, కమర్షియల్‌గా ఉపయోగించగలిగితే, ఇది ప్రపంచ వైమానిక రంగంలోనే గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ తెలిపారు. ప్రస్తుతానికి నేరుగా ఎగరగల, దిగగల వైమానిక వాహనం అంటే హెలికాప్టర్ మాత్రమే. అయితే, దాని వేగం చాలా తక్కువ, మెయింటెనెన్స్ ఖర్చు అధికం, ప్రయాణించే దూరం కూడా తక్కువ. దీంతో ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన టెక్నాలజీ నిజంగా గేమ్ ఛేంజర్‌గా మారుతుంది. ఒకవేళ ఈ టెక్నాలజీ విమానాలకు అమర్చడంలో సక్సెస్ అయితే వైమానిక రంగం స్వరూపమే మారిపోవచ్చు. విమానాలు ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి రన్‌వేలు అవసరం ఉండదు. కొండలు, అడవులు వంటి ఊహించలేని ప్రదేశాలలో కూడా విమానాలను సునాయాసంగా దించవచ్చు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెన్త్ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే
అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన
టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..
