గూగుల్ సెర్చ్‌లో సరికొత్త మోడ్.. ఇకపై మరింత ఈజీ

Updated on: Jul 18, 2025 | 8:04 PM

గూగుల్‌ మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేసింది. దీనివలన గూగుల్ లో సమాచారాన్ని సేకరించడం మరింత సులభతరం కానుంది. తన సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ తెచ్చిన 'ఏఐ మోడ్'.. ఇంటర్నెట్‌లో సమాచారాన్ని వెతికే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. జెమిని 2.5 సిస్టమ్‌పై ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఇంగ్లిష్‌లో సెర్చ్ చేసే వారందరికీ ఇది అందుబాటులోకి రానుంది.

దీని కోసం ప్రత్యేకంగా సెర్చ్ ల్యాబ్స్‌లో సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఏఐ మోడ్‌ను, యూజర్ల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా త్వరలో అందరికీ అందుబాటులోకి గూగుల్ తీసుకురానుంది. త్వరలో భారత్‌లోని యూజర్లకు గూగుల్ యాప్‌లోని సెర్చ్ బార్‌లో ఈ ఫీచర్ కనిపించనుంది. సంప్రదాయ సెర్చ్‌లో ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే అనేక వెబ్‌సైట్ల లింకులు తెరిచి, సమాచారాన్ని మనమే సేకరించుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు ఇకపై ఏఐ మోడ్ పరిష్కారం కానుంది. ఈ కొత్త విధానంలో, యూజర్లు మరింత ఈజీగా ప్రశ్నలను అడగవచ్చు. ఉదాహరణకు, “ఎక్కువ క్రీడా సామాగ్రి లేకుండానే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోదగిన ఆటలేమిటి? ఉదయం ఆఫీసుకు వెళ్లే టైమ్‌లో.. పది నిమిషాల్లో చేసుకోదగిన బ్రేక్ ఫాస్ట్ ఏంటి? వంటి ప్రశ్నలు అడిగినా.. ఏఐ మోడ్ వాటన్నింటినీ ప్రాసెస్ చేసి, టకటకా జవాబు చెప్పేస్తుంది. అంతేకాదు.. గూగుల్ చెప్పిన జవాబులకు అనుబంధ ప్రశ్నలు కూడా వేయొచ్చు. అలాగే, వాయిస్ కమాండ్స్ ద్వారా.. ఏదీ టైప్ చేసే పనిలేకుండానే ప్రశ్నలు వేయొచ్చు. గూగుల్ లెన్స్ ద్వారా ఫోటోలు తీసి వాటి వివరాలు కూడా తెలుసుకునే వెసులు బాటు ఇందులో ఉంది. ఈ మార్పుతో గూగుల్ సెర్చ్.. మునుపటి కంటే మరింత ఈజీ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంటి భయ్యా.. మందు తాగకుండానే పాజిటివ్‌

ఫోన్‌‌ చూసీ.. చూసీ.. యువకుడికి సరికొత్త వ్యాధి.. ఆ సామర్థ్యాన్ని కోల్పోయిన బాధితుడు

ప్రభాస్‌ సినిమాకు OTT దెబ్బ..! రిలీజ్‌ కష్టమేనా?

స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి

రిలీజ్‌కు ముందే 50 కోట్లు కొల్లగొట్టిన కింగ్‌ ??