గగనయాన్ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. ప్రతిష్టాత్మంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం వాయిదా పడింది. మిషన్ గగన్‌యాన్‌లో భాగంగా.. ప్రయోగాత్మకంగా గగన్ యాన్ జి 1, గగన్ యాన్ జీ2 రాకెట్ ప్రయోగాలను ఈ ఏడాదిలోగా జరపాలని ఇస్రో తొలుత భావించింది. అయితే.. అనివార్య కారణాలతో ఈ ప్రయోగాన్ని 2026 సంవత్సరానికి వాయిదా వేయడం జరిగిందని ఇస్రో చైర్మన్ ప్రకటించారు.
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇస్రో ప్రకటించింది. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా.. ఇస్రో ముగ్గురు భారత వ్యోమగాముల్ని దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి పంపేందుకు సిద్ధపడింది. అక్కడి నుంచి తిరిగి వాళ్లను సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రయోగంలో.. తమ తిరుగు ప్రయాణంలో వ్యోమగాములు సముద్రంపై దిగనున్నారు. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టుకు రూ.9000 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ మిషన్ విజయవంతమైతే.. అంతరిక్షంలోకి మనుషులను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇంతకు ముందు సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు ఈ చారిత్రాత్మక ఫీట్‌ని సాధించాయి. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు 8 వేల టెస్టులు పూర్తి చేసినట్లు ఇస్రో చైర్మన్ చెప్పారు. ఏది ఏమైనా 2027 వ సంవత్సరంలో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం పూర్తి చేసి స్పేస్ లోకి వ్యోమగాములను పంపాలనేది ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 2028 కల్లా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశానికి చెందిన ఒక స్పేస్ స్టేషన్‌ను నూతనంగా ఏర్పాటు చేయాలని ఇస్రో నిర్ణయించింది. అందులో భాగంగా ఇస్రో 2035 కల్లా స్పేస్ లోకి మరో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిని పంపి..అమెరికా, రష్యా, చైనాలకు ధీటుగా భారత్‌ను నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు
