Flying Taxis: త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

|

Oct 21, 2024 | 8:46 AM

ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలు అందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధమైంది. త్వరలోనే నగరంలో ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం ఇందిరానగర్‌ నుంచి విమానాశ్రయానికి చేరాలంటే గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు అని సార్లా ఏవియేషన్‌ సీఈఓ ఏడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు. ఇదో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.

ఈ ఎగిరే ట్యాక్సీలు సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన రద్దీతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.