అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి .. ఆ తర్వాత..

Updated on: Oct 21, 2026 | 5:07 PM

అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన తొలి పిల్లిగా ఫెలిసెట్‌ చరిత్ర సృష్టించింది. 1963 అక్టోబర్‌ 18న ఫ్రాన్స్‌ చేపట్టిన ప్రయోగంలో భాగంగా వెరోనిక్‌ రాకెట్‌ ద్వారా సుమారు 157 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఈ ప్రయాణం 13 నిమిషాల పాటు సాగింది. అయితే, అంతరిక్ష యానం తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దానిపై మరిన్ని ప్రయోగాలు నిర్వహించడంతో ఫెలిసెట్‌ జీవితం విషాదాంతమైంది.

మనుషులు అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి ముందు, అక్కడి పరిస్థితులు జీవుల శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వివిధ జంతువులపై ప్రయోగాలు చేశారు. ఆ చారిత్రాత్మక ప్రయోగాల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన తొలి పిల్లిగా ‘ఫెలిసెట్‌’ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1963 అక్టోబర్ 18న ఈ అద్భుత ప్రయాణం చోటుచేసుకుంది. 1960లలో అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు అంతరిక్ష రేసులో పోటీపడుతుండగా.. ఫ్రాన్స్ మాత్రం పిల్లిని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ప్రయోగశాలలో ‘C341’గా గుర్తింపు పొందిన ఈ పిల్లిని, వెరోనిక్ రాకెట్ ద్వారా సుమారు 157 కిలోమీటర్ల ఎత్తుకు పంపించారు. కేవలం 13 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో ఫెలిసెట్‌ ఐదు నిమిషాల పాటు మైక్రోగ్రావిటీ పరిస్థితులను అనుభవించింది. క్యాప్సూల్ సురక్షితంగా భూమికి చేరడంతో ఫెలిసెట్‌ అంతరిక్ష యానం విజయవంతమైంది. అయితే ఈ చారిత్రాత్మక ప్రయాణం తర్వాత ఫెలిసెట్‌ జీవితం విషాదాంతమైంది. మెదడుపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు రెండు నెలల తర్వాత దానికి కారుణ్యమరణం విధించారు. ఆ కాలంలో శాస్త్రీయ ప్రయోగాల్లో జంతువులను ఇలా ఉపయోగించేవారు. అయినప్పటికీ, అంతరిక్ష చరిత్రలో ఫెలిసెట్‌ చేసిన సాహసం శాస్త్ర విజ్ఞానానికి ఎంతో దోహదపడింది. జంతువులు చేసిన ఈ త్యాగాన్ని స్మరిస్తూ కాలక్రమేణా దానికి అధికారిక గుర్తింపు లభించింది. పిల్లి జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతరిక్ష పరిశోధనల అభివృద్ధిలో జంతువుల పాత్ర ఎంత కీలకమో ఫెలిసెట్‌ ఉదంతం నేటికీ గుర్తుచేస్తూనే ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్‌

ఎల్‌-నినో ముప్పు.. రాష్ట్రంలో తాగునీటి కటకట.. నీటి పొదుపే శ్రీరామరక్ష!

ఫస్ట్ జాబ్‌కే రూ.15,000.. కొత్త ఉద్యోగులకు బంపర్ బెనిఫిట్!

Loading...
Unable to load recommendations.
Follow Us