పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
ఈజిప్టు రాజధాని కైరోలో పుట్టిన కొన్ని గంటలకే ఓ పసికందు ఇచ్చిన ప్రత్యేక పోజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్య పరీక్షల సమయంలో ఒక కాలిపై మరో కాలు వేసుకుని ప్రశాంతంగా పడుకున్న చిన్నారిని చూసి వైద్యుడు ముచ్చటపడ్డారు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. పుట్టగానే ఇంత కూల్‌గా ఉన్నాడంటూ కామెంట్లతో పోస్టును నింపేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ కొన్ని వీడియోలు క్షణాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఈజిప్టు రాజధాని కైరోలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. పుట్టిన కొన్ని గంటల్లోనే ఓ పసికందు ఇచ్చిన పోజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కైరోలోని ప్రముఖ పీడియాట్రిషియన్ ఇటీవల ఒక నవజాత శిశువుకు ప్రసవానంతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆ చిన్నారి పడుకున్న భంగిమ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా పుట్టిన పసికందులు చురుగ్గా కదలడం లేదా ఏడుస్తుండటం మనం చూస్తుంటాం. కానీ, ఈ చిన్నారి మాత్రం ఒక కాలిపై మరో కాలు వేసుకుని, చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఎంతో రిలాక్స్‌డ్‌గా, ప్రశాంతంగా కనిపించాడు. ఈ క్యూట్ అండ్ యూనిక్ దృశ్యాన్ని చూసి ముచ్చటపడిన డాక్టర్ , వెంటనే తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. “అప్పుడే ఈ చిన్నారికి జీవితం అంటే ఏంటో తెలిసిపోయింది”, “ఫొటో కోసం పర్ఫెక్ట్ పోజ్ ఇస్తున్నాడు”, “పుట్టగానే ఫుల్‌గా చిల్ అవుతున్నాడు” అంటూ నెటిజన్లు తెగ సరదాగా స్పందిస్తున్నారు. పుట్టిన గంటల్లోనే ఎంతో స్టైలిష్‌గా, కూల్‌గా కనిపిస్తున్న ఈ పసికందు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎల్-నినో ముప్పు.. రాష్ట్రంలో తాగునీటి కటకట.. నీటి పొదుపే శ్రీరామరక్ష!
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా

