Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌

Updated on: Nov 11, 2025 | 4:14 PM

టెస్లా వాటాదారులు ఎలన్ మస్క్‌కు భారీ ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించారు, దీంతో అతను ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది. ఈ రికార్డుస్థాయి డీల్ మస్క్‌ను టెస్లాలో 7.5 సంవత్సరాలు ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొందరు సంస్థాగత పెట్టుబడిదారులు దీనిని వ్యతిరేకించినప్పటికీ, ఈ ఆమోదం టెస్లా షేర్ల విలువను పెంచింది. మస్క్ ఆనందంగా రోబోతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఎలన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు మరింత ధనవంతుడు కావడం ద్వారా చరిత్ర సృష్టించబోతున్నారు. టెస్లా సీఈవోకు ట్రిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు అంగీకరించారు. దీంతో త్వరలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌ చరిత్ర సృష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్యాకేజీ ప్రకటన తర్వాత మస్క్‌ సంతోషంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రోబోతో కలిసి వేదికపై డ్యాన్స్‌ చేశారు. గురువారం టెక్సాస్‌లో టెస్లా కంపెనీ వార్షిక సమావేశం లో మస్క్‌కు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు 75 శాతం మందికి పైగా షేర్‌ హోల్డర్స్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ ప్రకటన వెలువడిన అనంతరం మస్క్‌ ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రోబోతో కలిసి వేదికపై డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సందర్భంగా మస్క్‌.. తనకు మద్దతుగా ఓట్లు వేసిన వాటాదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారిని అభినందించారు. ఈ ప్రకటన నేపథ్యంలో టెస్లా షేర్ల విలువ పెరిగినట్లు తెలుస్తోంది. మస్క్‌ కనీసం ఏడున్నర సంవత్సరాలు టెస్లాలో ఉండేలా చూసుకోవడమే లక్ష్యంగా తాజా ప్యాకేజీని ప్రకటించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు టెస్లాలో మస్క్‌ వాటా 12 శాతంగా ఉంది. అది ఇప్పుడు 25 శాతానికి పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే.. ఆయన వేతనం రోజుకు 237 మిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వేతన డీల్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. ఈ ప్యాకేజీని నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వంటి కొన్ని పెద్ద సంస్థాగత పెట్టుబడి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ఎగ్జిక్యూటివ్‌కు ఇచ్చే అత్యధిక వేతనమని వాదించాయి. మరోవైపు మస్క్‌.. ప్యాకేజీని పెంచే విషయంపై టెస్లా బోర్డు వాటాదారులకు కీలక హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి మద్దతిచ్చేందుకు తిరస్కరిస్తే.. ఆయన కంపెనీ నుంచి వైదొలగాలనుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు

చిరంజీవి రికార్డును బీట్ చేసిన చరణ్.. మొత్తానికి ఊపుమీదున్న తండ్రీకొడుకులు

Reliance Jio: జియో కీలక నిర్ణయం.. జెమినీ AI ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం

చీకటిమయం కాబోతున్న భూమి.. కారణం అదేనంటున్న నాసా