ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. ఎలక్ట్రిక్ కార్లు, ఆటో పైలెట్ మోడ్ కార్లతో సంచలనం సృష్టించారు. ఇక, ఆయన సంస్థ స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధనల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన మస్క్ తను అనుకున్న విధంగానే ట్రంప్‌ను గెలిపించారు.
ఇక, ఇప్పుడు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇటీవల మస్క్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇండియా టు అమెరికా..అరగంటలో వెళ్లిపోవచ్చు అంటున్నారు ఎలన్ మస్క్. ఇది ఇంపాజిబుల్ అని మీరు అనుకోవచ్చు. మస్క్ తొందరపడి ఏదీ అనడు. అన్నాడంటే చేస్తాడంతే అనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లాలంటే ఇంచుమించుగా 16 గంటలు పడుతోంది. అయితే మస్క్ ప్రయోగం విజయవంతమైతే కేవలం 30 నిమిషాల్లో అమెరికా నుంచి ఇండియాకు చేరుకోవచ్చట. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయనున్నారట. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక సాంకేతికతను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు మస్క్ తెలిపారు. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ సృష్టించిన స్టార్ షిప్ రాకెట్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ప్రయాణం చేయవచ్చట. మస్క్ చేసిన ఈ ప్రకటన ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్