Israel Farming: ఇజ్రాయెల్ తో మన రైతులకున్న బంధమిదే.! ఆ ఏరోపోనిక్స్ టెక్నాలజీతో..

|

Oct 18, 2023 | 8:08 PM

ఇజ్రాయెల్ .. అరబ్ దేశాల మధ్య చిన్న దేశమే అయినా సాధించిన సాంకేతికత అపారం. నేడు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ పుష్కలంగా పంటలు పండుతాయి. దీనికి కారమాల్లో ఏరోపోనిక్స్ టెక్నాలజీని కూడా ఓ కారణంగా చెప్పచ్చు.

ఇజ్రాయెల్ .. అరబ్ దేశాల మధ్య చిన్న దేశమే అయినా సాధించిన సాంకేతికత అపారం. నేడు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. రక్షణ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే దేశం చుట్టూ సముద్రం, ఎడారి ఉన్నప్పటికీ ఇక్కడ పుష్కలంగా పంటలు పండుతాయి. దీనికి కారమాల్లో ఏరోపోనిక్స్ టెక్నాలజీని కూడా ఓ కారణంగా చెప్పచ్చు. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడం వల్ల భారీ నష్టాలు మన రైతాంగానికి భారీ నష్టాలు తప్పలేదు. కానీ మనవాళ్లు 1993లో ఇజ్రాయెల్‌తో చేతులు కలిపినప్పటి నుంచి పరిస్థితి మారింది. నెమ్మదిగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఇజ్రాయెల్ సహకారంతో 30కి పైగా వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అలవరచుకుని, అధునాతన వ్యవసాయం చేయాలనుకునే భారతీయ రైతుల శిక్షణకు ఇజ్రాయెల్ ఆహ్వానం పలుకుతుంది. ఇజ్రాయెల్ సహాయంతో ప్రస్తుతం భారతదేశంలో అనేక వ్యవసాయ శిక్షణ కేంద్రాలను కేంద్రం నిర్వహిస్తుంది. గాలిలో సాగుచేసే వ్యవసాయానికి కూడా ఇజ్రాయెల్‌ పేరుగాంచింది. ఈ దేశంలో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు. ఈ సాంకేతికతలో వ్యవసాయానికి భూమి లేదా నేల అవసరం లేదు. ఈ పద్ధతిలో పండించిన కూరగాయలు మట్టిలో పండే కూరగాయలతో పోలిస్తే.. ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం. ఇలాంటి టెక్నాలజీయే మన రైతులను ఇజ్రాయెల్ వైపు చూసేట్లు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..