మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

Updated on: May 30, 2026 | 11:35 AM

భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపై మానవ నివాసాలు సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో చైనా టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో కృత్రిమ మానవ పిండాలపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ప్రభావాలు ప్రారంభ జీవ అభివృద్ధిపై ఎలా ఉంటాయో అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధన అంతరిక్షంలో మానవ మనుగడకు సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భూమి మీద జీవితం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారి దృష్టి భూమిని దాటి అంతరిక్షంపై పడింది. ఏదో ఒకరోజు మనుషులు చంద్రుడు, మార్స్ వంటి వాటిపై నివసిస్తే… అక్కడ పిల్లలు పుట్టగలరా? మానవ జాతి అంతరిక్షంలో కొనసాగగలదా? ఇదే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ఇప్పుడు చైనా పరిశోధనలు చేస్తోంది. ఇటీవల చైనా తన అత్యాధునిక అంతరిక్ష కేంద్రం టియాన్‌గాంగ్‌ స్పేస్ స్టేషన్ వేదికగా ఒక ప్రయోగం చేస్తోంది. ఇందులో మనుషులను కాకుండా కృత్రిమ మానవ ఎంబ్రియోలను పంపారు. వీటిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి… గురుత్వాకర్షణ లేకపోవడం, అంతరిక్ష రేడియేషన్‌ వంటి పరిస్థితులు శిశువుల ప్రారంభ ఎదుగుదలపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోబోతున్నారు. భూమిపై మన శరీరం గురుత్వాకర్షణకు అలవాటుపడింది. కానీ స్పేస్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ శరీరంలోని కణాలు, ఎముకలు, కండరాలు, రక్త ప్రసరణ అన్నీ మారిపోతాయి. అలాంటప్పుడు ఒక శిశువు గర్భంలో ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎంబ్రియో సురక్షితంగా పెరుగుతుందా? లేక ప్రమాదాలు ఎదురవుతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. ఈ ప్రయోగం భవిష్యత్తులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే దశాబ్దాల్లో చంద్రుడిపై లేదా మార్స్ పై మానవుల కోసం కాలనీలను నిర్మించాలని అనేక దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. అక్కడ మనుషులు సంవత్సరాల తరబడి జీవించాల్సి వస్తే… కొత్త తరాలు కూడా అక్కడే పుట్టాల్సి రావచ్చు. అందుకే ఈ పరిశోధనను “మనిషి భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోగం”గా భావిస్తున్నారు. ఈ ప్రయోగంపై కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్ష రేడియేషన్‌ వల్ల డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని, దీని ప్రభావం శిశువుల ఆరోగ్యంపై పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తలతో ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది.. “భవిష్యత్తులో స్పేస్‌లో పుట్టిన తొలి బేబీ ఎవరు?” ఈ ప్రశ్నకు సమాధానం దొరకడానికి ఇంకా సమయం ఉన్నా… చైనా చేసిన ఈ ప్రయోగం మాత్రం అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇటీవల చైనా Long March 7 రాకెట్ ద్వారా ప్రయోగించిన తియాంజౌ మిషన్‌లో కృత్రిమ మానవ పిండాల నమూనాలను అంతరిక్షంలోకి పంపింది. ఇవి విజయవంతంగా టియాన్‌గాంగ్‌ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నాయి. అక్కడ మైక్రోగ్రావిటీ వాతావరణంలో సుమారు ఐదు రోజుల పాటు ఈ నమూనాల అభివృద్ధిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అక్కడ శరీరంలోని కణాల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ పిండం ఎలా స్పందిస్తుంది? అభివృద్ధి సాధారణంగా జరుగుతుందా? లేక రేడియేషన్ వల్ల సమస్యలు వస్తాయా? అనే అంశాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. ఈ ప్రయోగంలో కేవలం మానవ కృత్రిమ పిండాలే కాదు… జెబ్రాఫిష్‌, ఎలుకల పిండాలను కూడా పంపారు. భూమిపై పెంచిన నమూనాలతో పోల్చి, అంతరిక్షంలోని మార్పులను విశ్లేషించనున్నారు. దీని ద్వారా జీవం అభివృద్ధిపై స్పేస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఇవి నిజమైన మానవ పిండాలు కావు. మానవ మూలకణాలతో ప్రయోగశాలలో రూపొందించిన ప్రత్యేక నమూనాలు మాత్రమే. ఇవి గర్భంలోని తొలి దశల అభివృద్ధిని మాత్రమే పోలి ఉంటాయి. అంటే సుమారు 14 నుంచి 21 రోజుల దశను సూచిస్తాయి. ఇవి పూర్తిస్థాయి శిశువులుగా మారే అవకాశం లేదని చైనా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అంతరిక్షంలో తీవ్రమైన రేడియేషన్‌, గురుత్వాకర్షణ లేకపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో మానవ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఎందుకంటే రాబోయే కాలంలో చంద్రుడు, అంగారక గ్రహంపై మానవ కాలనీలను నిర్మించాలన్న ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో అక్కడ కొత్త తరాలు పుట్టే అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలుసుకోవడం చాలా కీలకం. అంతరిక్షం… ఇప్పటికీ మనిషికి పూర్తిగా అర్థం కాని ఓ మహా రహస్య ప్రపంచం. అక్కడ జీవం ఎలా ఉంటుంది? మనిషి ఎంతకాలం బతకగలడు? భూమి బయట కొత్త తరాలు పుట్టగలవా? అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే దిశగా చైనా ఒక సంచలన అడుగు వేసింది. 1961లో తొలిసారిగా మనిషి అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుంచి… “స్పేస్‌లో పిల్లలు పుట్టగలరా?” అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే 60 ఏళ్లకు పైగా గడిచినా దీనికి స్పష్టమైన సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. కానీ ఇప్పుడు చైనా చేసిన ప్రయోగం ఈ రహస్యాన్ని ఛేదించే దిశగా కీలకంగా మారింది. ఈ ప్రయోగం ఫలితాలు భవిష్యత్తులో అంతరిక్షంలో మానవ మనుగడకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. ఒకవేళ ఈ పరిశోధనలు విజయవంతమైతే… రేపటి రోజుల్లో “స్పేస్ బేబీస్” అనే కాన్సెప్ట్ నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక

ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం!

Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!

‘ఇండియన్స్‌ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

Follow Us