Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా

Updated on: Dec 28, 2025 | 5:00 PM

గూగుల్ ఇప్పుడు జీమెయిల్ యూజర్ ఐడీని మార్చుకునే అద్భుతమైన సౌలభ్యాన్ని పరిచయం చేస్తోంది. పాత, నచ్చని ఐడీలతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది గొప్ప అవకాశం. ఈ ఫీచర్ ప్రస్తుతం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది, పూర్తిస్థాయిలో రావడానికి సమయం పడుతుంది. ఐడీ మార్చుకున్నా, ఇది పాత ఖాతాగానే పరిగణించబడుతుంది. ఒకసారి మార్చాక ఏడాది వరకు మళ్లీ మార్చలేరు, గరిష్టంగా మూడుసార్లు మాత్రమే అనుమతి.

పాస్‌వర్డ్‌ అంటే పదే పదే మార్చుకోవచ్చు కానీ.. ఆల్రెడీ క్రియేట్‌ చేసిన మెయిల్‌ ఐడీని ఎలా మారుస్తాం అనుకుంటున్నారా. మార్చుకోవచ్చు. అవును గూగుల్‌ ఇప్పుడు అలాంటి సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనుంది. ఇకపై జీ-మెయిల్ ఐడీని మార్చుకునే అవకాశం కలగనుంది. పాత యూజర్ ఐడీతో సంతృప్తి చెందని వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అయితే, ఈ ఆప్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు అంటున్నారు. మెయిల్ క్రియేట్ చేసే సమయంలో సరైన ఆలోచన లేకనో, నచ్చిన పేర్లు అందుబాటులో లేకనో చాలామంది ఏదో ఒక యూజర్ ఐడీతో మెయిల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఐడీ మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో చాలా సందర్భాలలో అదే ఈ-మెయిల్ ఐడీని కొనసాగించాల్సి వస్తుంది. పాత డేటాను కోల్పోవడం ఇష్టం లేనివారు కూడా అదే మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, ఈ-మెయిల్ ఐడీని మార్చుకునే సౌలభ్యాన్ని గూగుల్ తీసుకువచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ కనిపించింది. ఐడీ చివరలో జీమెయిల్.కామ్‌ను అలాగే కొనసాగిస్తూ యూజర్ నేమ్‌ను మార్చుకోవచ్చు. ఐడీ మార్చుకున్నప్పటికీ అది పాత ఖాతాగానే పరిగణించబడుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఒకసారి ఐడీ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మళ్లీ మార్చుకునే అవకాశం ఉండదు. అలాగే, ఒక ఐడీని గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే

Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు