Loading video

జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3

|

Mar 13, 2025 | 1:17 PM

చంద్రుని ఉపరితలానికి కింద.. ధ్రువప్రాంతాల్లో మరిన్నిచోట్ల ఐస్‌ ఉండే అవకాశం ఉంది. చంద్రయాన్‌-3 సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయం తెలిసింది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీస్థాయి మార్పుల వల్ల ఇలా ఐస్‌ ఏర్పడుతుందని అహ్మదాబాద్‌లోని ‘ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ’కి చెందిన ఫ్యాకల్టీ దుర్గాప్రసాద్‌ కరణం తెలిపారు.

వీటిని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఐస్‌ ఎలా ఏర్పడింది, అది కాలగతిలో ఎలా కదులుతూ వచ్చింది అనేది తెలుసుకోవడం ద్వారా చంద్రశిలల ప్రక్రియ తొలినాళ్ల గురించి సమగ్ర అవగాహనకు వీలుంటుందని చెప్పారు. చంద్రయాన్‌-3లోని ల్యాండర్ విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞా‌న్ సేకరించిన చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతల డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అక్కడ 82 డిగ్రీల సెల్సియస్‌ నుంచి మైనస్‌ 170 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని తెలుసుకున్నారు. సూర్యునికి అభిముఖంగా కాకుండా దూరంగా ఉండే వాలు ప్రాంతాల్లో చల్లదనం వల్ల చంద్రునిపై ఐస్‌ ఏర్పడుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిని నీటిగా మార్చే అవకాశం లేదని, అది ఆవిరిగా మారిపోవచ్చని దుర్గాప్రసాద్‌ చెప్పారు. అహ్మదాబాద్‌లోని శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం.. చంద్రుని ఉపరితలంపై పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలను కనుగొంది. చంద్రుని ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉపరితలం నుంచి 10 సెం.మీ కంటే తక్కువ మంచు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏలియన్స్‌ ఉన్నారు..! ఆ గ్రహంపై కనిపించారని సంచలన రిపోర్ట్‌

ఎన్నో చెత్త సినిమాలకంటే.. నా భర్త సినిమా నయం