Asteroid: అత్యంత వేగంగా సూర్యుడిని చుట్టేస్తున్న గ్రహశకలం.. వీడియో

|

Aug 27, 2021 | 9:49 AM

కొన్ని రోజుల క్రితమే భూమికి చాలా దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకుపోయింది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ గ్రహశకలం గురించి మర్చిపోక ముందే..

కొన్ని రోజుల క్రితమే భూమికి చాలా దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకుపోయింది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ గ్రహశకలం గురించి మర్చిపోక ముందే.. ఖగోళ శాస్త్రవేత్తలు మరో గ్రహశకలాన్ని గుర్తించారు. ఇది భూమికి దగ్గర్లో కాదు సూర్యుడికి దగ్గర్లో ఉంది. చిలీలోని డార్క్ ఎనర్జీ కెమెరా (డీఈక్యామ్)తో దీనిని గుర్తించారు.విక్టర్ ఎం బ్లాంక్ టెలిస్కోప్‌ ద్వారా సేకరించిన డేటాను పరిశీలించే సమయంలో స్కాట్ ఎస్ షెపర్డ్ అనే శాస్త్రవేత్త ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. మన సౌరవ్యవస్థలో అత్యంత తక్కువ సగటు దూరంలో ఉన్న గ్రహశకలం ఇదేనట. దీనికి 2021 పీహెచ్27 అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. దీని కక్ష్య చాలా చిన్నదని సైంటిస్టులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నదిలో తేలుతున్న శవం.. తీర దగ్గరికెళితే.. షాక్ తిన్న అధికారులు.. వీడియో

Zambia President: జాంబియా దేశాధ్యక్షుడిగా గొర్రెల కాపరి.. 10 లక్షల ఓట్ల మెజారిటీతో..!! వీడియో

Follow us on