కిచెన్‌లో ఏఐ అసిస్టెంట్‌క్షణాల్లో కావాల్సిన రెసిపీ రెడీ

Updated on: Oct 27, 2025 | 1:38 PM

కొత్త కోడలికి వంట రాదనే దిగులు ఉందా? అన్ని రకాల వంటకాలతో అత్తారింటిలోని అందరినీ ఎలా మెప్పించాలనే టెన్షన్‌ ఉందా? ఇక మీదట అలాంటి రంది అసలే అక్కర్లేదు. ఎందుకంటే మీకు నచ్చిన టేస్ట్‌ చెబితే చాలు మీరు కోరుకున్న వంట క్షణాల్లో పొయ్యి మీద రెడీ అయిపోతుంది. యస్‌.. మీరు వింటున్నది నిజమే.. మీకు కావాల్సిన వంటను కావాల్సిన టేస్ట్‌లో రెసిపీ చేసిపెట్టే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది.

AI-ఆధారిత కిచెన్ అసిస్టెంట్‌ అయిన అప్లియెన్స్ 2.0 ఇప్పుడు ఆడాళ్లకు ఓ వరంగా చెప్పొచ్చు. కిచెన్‌లో వంట రుచిగా రావడానికి మహిళలు పడే అనేక కష్టాలకు దీంతో చెక్‌ పెట్టేయొచ్చన్నమాట. ప్రతి ఒంటకాన్ని ఓ ఫార్ములాగా రెడీ చేయడమే దీని ప్రత్యేకత. మసాలా చాయ్ నుండి బిర్యానీ వరకు, అప్లియన్స్ 2.0 లో చాలా వంటకాలు ఉన్నాయి. అప్లియన్స్ 2.0 దాదాపు మిక్సర్-గ్రైండర్ పరిమాణంలో ఉంటుంది, ముందు భాగంలో స్క్రీన్ ఉంటుంది. వంట నుంచి సాటింగ్, స్టీమింగ్ వరకు ప్రతిదీ చేసే పెద్ద జార్, పదార్థాలను సరిగ్గా కొలవడానికి ఒక చిన్న పాత్ర, వంటలో మీకు సహాయపడటానికి మరికొన్న పాత్రలు ఉంటాయి. మీరు అప్లియన్స్ యాప్‌ను పరికరానికి కనెక్ట్ చేయాలి, దీనికి Wi-Fi కనెక్షన్ అవసరం. మీరు ఫోన్‌లో వంటకాలను బ్రౌజ్ చేసి ఏది కావాలో దానికి కావాల్సిన ఫార్ములాను, రెసిపీని అందిస్తుంది. ఏది ఎంత మోతాదులో కలపాలో స్క్రీన్‌పై సలహాలు ఇస్తూ వంటలో సహాయం చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Diabetes: నిద్రతో డయాబెటిక్‌కు చెక్‌..