ఇక నుంచి మరణించిన ఆత్మీయులతో మాట్లాడొచ్చట !!

|

Oct 27, 2024 | 9:57 PM

అదేదో సినిమాల్లో చూపించిన విధంగానే నిజ జీవితంలో కూడా ఆత్మలతో మాట్లాడితే ఎలా ఉంటుంది? యస్‌.. మీరు వింటున్నది నిజమే.. చనిపోయిన తర్వాత శరీరం వదిలి వెళ్లిపోయిన ఆత్మలతో సంభాషిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఏంటి మీ బొందా అనుకుంటున్నారా? యస్‌.. ఆ బొంద పక్కన నిల్చుని ఆ బొందలోని ఆత్మతో మంచీ చెడులు ముచ్చటిస్తే ఎలా ఉంటుంది?

మీ డౌటనుమానాలు అవసరం లేదంటోంది సరికొత్త టెక్నాలజీ. టెక్నాలజీ సాయంతో ఆత్మలతో ఏంచక్కా మాట్లాడేయొచ్చట. మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మరణించిన వారి రూపంతో డిజిటల్‌ అవతార్‌లను ఈ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. వీటికి ‘డెడ్‌బోట్‌’ అని పేరు పెట్టాయి. వారు జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, వీడియోలను వినియోగించి ఈ అవతార్‌లను తయారుచేస్తున్నాయి. ఇవి అచ్చం మరణించిన మనిషిలానే మాట్లాడతాయి. ఇటీవల ఈ డెడ్‌బోట్‌లకు చైనాలో ఆదరణ పెరుగుతున్నది. ఇదే సమయంలో దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు సహజంగా వారిని మర్చిపోయే ప్రక్రియకు ఈ డెడ్‌బోట్‌లు ఆటంకంగా మారతాయని, మరణించిన మనిషిని మరిచిపోకుండా చేస్తాయని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

కుక్క వెంటపడి.. థర్డ్ ఫ్లోర్‌ నుంచి కింద పడ్డ యువకుడు

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..