Aditya L1: సక్సెస్‌ఫుల్‌గా ఆదిత్య ఎల్1 ప్రయాణం.. మూడోసారి కక్ష్యపెంపు విజయవంతం.
సూర్యుడిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 10న మూడోసారి భూకక్ష్యను పెంచారు. ఈ విన్యాసం విజయవంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ శాస్త్రవేత్తలు ఈ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ట్విట్టర్‌లో పేర్కొంది.
సూర్యుడిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 10న మూడోసారి భూకక్ష్యను పెంచారు. ఈ విన్యాసం విజయవంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ శాస్త్రవేత్తలు ఈ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ విన్యాసాన్ని బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, మారిషస్‌లోని ఇస్రో కేంద్రాలు పరిశీలించాయని చెప్పింది. మూడో భూకక్ష్య విన్యాసం సమయంలో ఉపగ్రహాన్ని మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్ట్రాక్, ఇస్రో కేంద్రాలు ట్రాక్ చేశాయి. ప్రస్తుతం ఉపగ్రహం 296 X 7,176 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. సెప్టెంబరు 15 తెల్లవారుజామున 2 గంటలకు నాలుగో విన్యాసాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో పేర్కొంది. ఆదిత్య-ఎల్1.. 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. ఐదు దశల్లో కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహిస్తారు. 16 రోజుల పాటు భూ కక్ష్యలోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య- ఎల్1.. అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ 1 వైపు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..