Lunar Eclipse 2026: 2026లో తొలి చంద్రగ్రహణం అప్పుడే

Updated on: Jan 12, 2026 | 10:32 AM

2026లో నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి; వాటిలో మార్చి 3న వచ్చే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. హోళీకా దహనం రోజున ఏర్పడే ఈ అద్భుత ఖగోళ సంఘటన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. సూతక కాలం, పాటించాల్సిన జాగ్రత్తలు, గర్భిణుల సూచనలు, దేశంలోని ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి.

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ప్రతి ఏటా ఖగోళశాస్త్ర ప్రకారం కానివ్వండి.. జ్యోతిష శాస్త్ర ప్రకారం కానివ్వండి గ్రహణాలు సంభవిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. మరి 2026లో ఎన్నిగ్రహణాలు సంభవిస్తాయి? ఎప్పుడు సంభవిస్తాయనే విషయాలు తెలుసుకుందాం. 2026 లో, మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు సంభవించబోతున్నాయి. కాగా సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణాలు పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ కనిపించవచ్చు. అలాగే ఒక చంద్రగ్రహణం మాత్రమే భారత్‌లో కనిపిస్తుంది. అది మార్చి 3న ఏర్పడే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ గ్రహణం హోళీకా దహనం రోజున ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది 2026లో మార్చి 3వ తేదీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుంది. ఈరోజున చంద్రుడు కేతువుతో పాటు సింహరాశిలో ఉంటాడు. అలాగే రాహువు చంద్రుడిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. ఈ రోజున చంద్రుడు బాగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇది మార్చి 03వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై. సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుందట. ఈ చంద్రగ్రహణం సుమారు ఒక గంట 31 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి భారతదేశంలో సూతక్ కాలం కూడా చెల్లుతుంది. ఈ సూతక కాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభం అవుతుంది. చంద్ర గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెబుతారు. అలాగే దేవాలయాలను మూసి వుంచుతారు. చాలామంది గ్రహణ సమయంలో మంత్ర జపం చేస్తారు. గ్రహణం సమయంలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిదని చెబుతారు. గర్భిణులు గ్రహణం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం ఆచరించాలి. ప్రాంతాలు, సంప్రదాయాలు బట్టి సూతక్ ఆచారాలు మారవచ్చు. ఇక ఈ గ్రహణం మనదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని సమాచారం. భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుందట. ఇక భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం అని గమనించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

శ్రీవారి భక్తులు అలెర్ట్.. జనవరి 24 నుండి 26 వరకు SSD టోకెన్లు రద్దు

బైకర్‌ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్‌

టెన్త్‌ పరీక్షల్లో మార్కులు కొట్టేయాలంటే

Published on: Jan 12, 2026 09:58 AM