ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్ ఒకటే !!
లక్షలాది మంది ఇప్పటికీ '123456' వంటి బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు, ఇది ఆన్‌లైన్ భద్రతకు పెను ప్రమాదం. కంపేరిటెక్ నివేదిక ప్రకారం, కోట్లాది పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. AI టూల్స్ పెరిగిన ఈ రోజుల్లో, హ్యాకర్లు సులభంగా మీ ఖాతాలను ఛేదించగలరు. కనీసం 12 అక్షరాలతో కూడిన బలమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి మీ ఆన్‌లైన్ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోండి.
123456 ఫ్యాన్సీ నంబరు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఇంకా లక్షలాది మంది ఆన్‌లైన్ ఖాతాలకు ఈ నంబర్ పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారు. ఈ జాబితాలో మీరూ ఉంటే కచ్చితంగా పాస్‌వర్డ్ మార్చండి. యూకేకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘కంపేరిటెక్’ ఓ ఆసక్తికర నివేదికను రూపొందించింది. డేటా బ్రీచ్ ఫోరమ్స్‌లో లీక్ అయిన 200 కోట్లకుపైగా పాస్‌వర్డ్స్‌ను కంపేరిటెక్ సేకరించింది. ఆ డేటా ఆధారంగా అత్యధికంగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. 123456 పాస్‌వర్డ్‌ను కొన్ని కోట్ల మంది ఆన్‌లైన్ ఖాతాలకు ఉపయోగిస్తున్నారట. 12345678, 123456789ను చాలా మందే వినియోగిస్తున్నారట. ఆ తర్వాతి స్థానాల్లోadmin, 1234 పాస్‌వర్డ్స్ ఉన్నాయి. అత్యధికంగా వినియోగించిన టాప్–100 పాస్‌వర్డ్స్‌లో 53వ స్థానాన్ని India@123 ఆక్రమించింది. ప్యారిస్‌లోని లూవ్రె మ్యూజియంలో సెక్యూరిటీ సిస్టమ్‌కు Louvre అనే పదం పాస్‌వర్డ్‌గా ఉంది. ఇంత సులభంగా ఉండడం వల్లే దోపిడీ నిమిషాల్లో పూర్తయ్యింది. సుమారు రూ.900 కోట్ల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. పాస్‌వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండాలని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. సులభంగా గుర్తించే అవకాశం ఇవ్వకుండా చిన్న, పెద్ద అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాల కలయికతో రూపొందించుకోవాలి. కుటుంబ సభ్యులు, వ్యక్తులు, ఉత్పత్తి పేరును పాస్‌వర్డ్‌గా ఉపయోగించకపోవడం మంచిది. తద్వారా మరొకరి చేతుల్లోకి పాస్‌వర్డ్ వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇంటికి తాళం వేసినప్పుడు ఒకటికి రెండుసార్లు లాగి సరిగ్గా పడిందా లేదా అని చూస్తాం. అలాంటిది మన కష్టార్జితం అంతా దాచుకున్న బ్యాంకు ఖాతాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించే వ్యక్తులు ఎక్కువమంది ఉంటే అటువంటి ఖాతాలను హ్యాకర్లు సులభంగా ఛేదించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏఐ టూల్స్‌ను సైబర్ నేరస్తులు ఆయుధంగా చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నెటిజన్లు జాగ్రత్త పడకపోతే బాధితులుగా మిగిలిపోతారు. ఊహించడం కష్టంగా, దొంగిలించేందుకు వీలులేని కష్టమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోండి .
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.20 వేలా ?? ఐఫోన్ పౌచ్‌పై ట్రోలింగ్
మీ కళ్లు చెబుతాయి ఇక.. మీ వ్యాధులేమిటో !!
తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ కూతురి గొడవ కోర్టు అసహనం
అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి