Kotamreddy Sridhar Reddy: తన హత్యకు కుట్రపై స్పందించిన MLA కోటంరెడ్డి..
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రౌడీషీటర్లు తనను హత్య చేస్తే కోట్ల రూపాయలు ఇస్తారని మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. ఈ కుట్రకు పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. TV9 న్యూస్‌తో మాట్లాడుతూ.. తనను చంపడానికి కోట్ల రూపాయలు అందిస్తున్నారని రౌడీషీటర్లు మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో పాత్ర పోషించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రౌడీషీటర్ల బెదిరింపులకు తాను భయపడనని, తాను భయపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదని కోటం రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం
