కదిరి లక్ష్మీనరసింహస్వామి రథానికి తాళ్లరేవు కొబ్బరితాడు

Updated on: Jan 31, 2026 | 9:34 AM

కాకినాడ జిల్లా తాళ్లరేవు మరోసారి తన ప్రత్యేక నైపుణ్యాన్ని నిరూపించింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం కోసం 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవు గల భారీ కొబ్బరి తాడును భక్తి శ్రద్ధలతో తయారు చేశారు. 2 టన్నుల బరువున్న ఈ తాడు తయారీలో 300 మంది కార్మికులు వారం రోజులు శ్రమించారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారైన ఈ తాడు ఆలయ రథోత్సవాలకు తాళ్లరేవు తాళ్ల నాణ్యతను చాటింది.

కొబ్బరి తాళ్ల తయారీలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన కాకినాడ జిల్లా తాళ్లరేవు మరోసారి తన ప్రత్యేక నైపుణ్యాన్ని చాటుకుంది. సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి స్వామివారి రథాన్ని లాగేందుకు వినియోగించే భారీ కొబ్బరి తాడును తాళ్లరేవు ప్రాంతానికి చెందిన నిపుణులైన కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో సిద్ధం చేశారు. ఈ భారీ తాడు సుమారు 30 అంగుళాల మందంతో, 400 అడుగుల పొడవుతో రూపొందించారు. సంప్రదాయ పద్ధతుల్లో, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ తాడు తయారు చేశారు. మొదట 220 చిన్న కొబ్బరి తాళ్లను ఒకటిగా కలిపి ఒక ప్రధాన తాడుగా తయారు చేశారు. అనంతరం అటువంటి నాలుగు ప్రధాన తాళ్లను సమన్వయంతో కలిపి, ప్రత్యేక నైపుణ్యంతో ఈ భారీ తాడును నేశారు. ఈ తాడు తయారీలో సుమారు 300 మంది కార్మికులు వారంరోజుల పాటు నిరంతరంగా శ్రమించి రూపొందించారు. తాడుమొత్తం బరువు సుమారు రెండు టన్నులుగా ఉంటుందని అంచనా. దృఢత్వం, భద్రత దృష్ట్యా అన్ని ప్రమాణాలను పాటిస్తూ తాడు తయారు చేసినట్లు తాళ్ల వ్యాపారులు తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న రథోత్సవానికి ముందుగా ఈ ప్రత్యేక తాడును ప్రత్యేక వాహనంలో కదిరికి తరలించనున్నట్లు వెల్లడించారు. తాళ్లరేవులో తయారయ్యే కొబ్బరి తాళ్లు నాణ్యత, బలానికి ప్రసిద్ధి. ఆలయ రథోత్సవాల వంటి పవిత్ర కార్యక్రమాలకు ఇక్కడ తయారైన తాళ్లను వినియోగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్‌ షో

యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?

ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్