Hyderabad: చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద బ్యాగ్.. భయపడుతూ వెళ్లి ఓపెన్ చేయగా
చర్లపల్లి రైల్వే స్టేషన్ హడావుడిగా ఉంది. ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు రైళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఓ చోట నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ఇంతకీ అదేంటి అని చూడగా.! దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి, సంచిలో కట్టి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కుషాయిగూడ ఏసీపీ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11 గంటలకు మహిళ మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో పెట్టి రైల్వేస్టేషన్‌లో పడేశారు. ఆటోలో మృతదేహాన్ని మూటలో చుట్టి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నాం. మహిళ వయస్సు 35 సంవత్సరాలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. గన్ని బ్యాగ్‌లో తెచ్చిపడేయటంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం.