AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

Phani CH
|

Updated on: May 01, 2026 | 7:12 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపు డీజే శబ్దానికి 140 కోళ్లు మరణించాయి. పౌల్ట్రీ ఫామ్ యజమాని సబీర్ అలీ ఫిర్యాదుతో పోలీసులు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన శబ్ద కాలుష్యం మూగజీవాలపై చూపే తీవ్ర ప్రభావాన్ని వెల్లడిస్తుంది. డీజే సౌండ్‌తో కోళ్లకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి ఊరేగింపు అంటేనే డీజే సౌండ్లు, డ్యాన్సులతో సందడిగా ఉంటుంది. కానీ ఆ సందడి కాస్తా ఓ పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. డీజే నుంచి వచ్చిన అతి భయంకరమైన శబ్దాన్ని తట్టుకోలేక ఏకంగా 140 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దరియాపూర్ గ్రామానికి చెందిన సబీర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి ఆయన ఫామ్ మీదుగా ఒక పెళ్లి ఊరేగింపు వెళ్లింది. ఆ సమయంలో డీజే ఆపరేటర్ సౌండ్‌ను విపరీతంగా పెంచేశాడు. ఆ తీవ్రమైన శబ్ద తరంగాలకు ఫారంలోని కోళ్లు భయాందోళనకు గురై చిందరవందరగా పరుగెత్తాయి. డీజే హోరు తగ్గకపోవడంతో, ఆ ఒత్తిడిని తట్టుకోలేక 140 కోళ్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. తన కోళ్ల మృతికి డీజే ఆపరేటర్ కవి యాదవ్ నిర్లక్ష్యమే కారణమని సబీర్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ శబ్దం వల్ల కోళ్లు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, కోళ్ల మృతికి అసలు కారణం శబ్ద కాలుష్యమేనా లేక మరేదైనా జబ్బు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిమితికి మించి సౌండ్ పెట్టి మూగజీవాల మృతికి కారణమైన ఈ ఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది

ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్‌ ట్విస్ట్‌

వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ

Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్

Follow Us