Scene of the day: 880 అడుగులు ఎత్తు నుంచి కృష్ణమ్మ దూకితే ఎట్టా ఉంటాదో తెలుసా..?

Updated on: Jul 28, 2025 | 8:46 PM

ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు దూసుకొస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం శ్రీశైలకు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిండటంతో అధికారులు నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తు నుంచి కృష్ణమ్మ దూకితే ఎట్టా ఉంటాదో తెలుసా.. రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదపోటు ఏ రేంజ్‌లో ఉంటాదో తెలుసా.. ఇదిగో ఇట్టా ఉంటాది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు బిరబిరా పరుగెడుతోంది.
శ్రీశైల మల్లన్న చెంత ఉధృతంగా ప్రవహిస్తూ.. నాగార్జునసాగర్‌వైపు పోటెత్తింది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published on: Jul 28, 2025 08:45 PM