Srisailam: శ్రీశైలం మల్లన్న ..నీ ఆదాయం పెరిగిందన్నా

|

Mar 02, 2024 | 7:35 PM

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ శివయ్య తన దేవేరి పార్వతితో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. మాఘమాసం, ఇటీవలే నిర్వహించిన మహాకుంభాభిషేకం కార్యక్రమాలతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ శివయ్య తన దేవేరి పార్వతితో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. మాఘమాసం, ఇటీవలే నిర్వహించిన మహాకుంభాభిషేకం కార్యక్రమాలతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా 49 రోజులలో శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5,62,30,427 రూపాయలు ఆదాయం సమకూరింది. నగదుతోపాటు 800 మిల్లీ గ్రాముల బంగారం, దాదాపు 8 కేజీల వెండి సమకూరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుడు టైంకు రాలేదని.. బావను పెళ్లాడిన యువతి !!

Follow us on